MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, ఏప్రిల్ 9 : హిందూ స్మశాన వాటికలోని డంప్ యార్డును తొలగించే వరకు పోరాడుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటిక సంరక్షణ సమితి నాయకులతో ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. హిందూ స్మశానవాటికను డంప్ యార్డుగా మార్చడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. డంప్ యార్డులో కూర్చొని ధర్నా చేస్తే ప్రభుత్వం దిగివచ్చిందని అన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు రెవెన్యూ మంత్రికి వినతి పత్రం అందజేశామని అన్నారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆగమేఘాలమీద పరిశీలించడానికి పంపించడంతో సమస్య కొలిక్కి వచ్చే అవకాశముందని అన్నారు.
డంప్ యార్డ్‌లో రాంకీ సంస్థ చేపడుతున్న నిర్మాణ పనులను ఆపేయాలని సిఫారసు చేయడం పోరాట ఫలితమని అన్నారు. ప్రైవేట్ సంస్థలు ఎన్నో ఏండ్ల నుండి మచ్చ బొల్లారం స్మశానవాటికలో యధేచ్చగా చేపడుతున్న అక్రమ నిర్మాణ పనులను సంబంధిత మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అసెంబ్లీలో ప్రస్తావించామని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిందని అన్నారు. సంబంధిత హైడ్రా నిజానిజాలు తెలుసుకొని సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించడం హర్షనీయమని అన్నారు. డంపింగ్ యార్డును హిందూ స్మశానవాటికలో నుండి తొలగించే వరకు తన పోరాటం ఆగదని, ఇది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని అన్నారు.
ప్రజలు తమ హక్కుల కోసం ఎవరికి భయపడకుండా ముందుకు వచ్చిన నాడే అక్రమ భూ దందాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. డంపింగ్ యార్డు విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు, బెదిరింపులకు భయపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, మహేష్, ప్రశాంత్ రెడ్డి , కవిత, పుష్ప, సుధాకర్, వీరేందర్, లచ్చిరెడ్డి, రచప్ప, రహీమ్ వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ