Old Friends | శామీర్పేట, జూన్ 1: చిన్నతనంలో కలిసి చదువుకున్న తమ స్నేహితుడి కుటుంబానికి పూర్వ విద్యార్థులంతా అండగా నిలిచారు. అనారోగ్యంతో స్నేహితుడు మరణించడంతో కష్టాల్లో మునిగిపోయిన కుటుంబానికి అర్థిక సాయం అందించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిపాల్ రెడ్డి 1999-2000 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్నాడు. అయితే ఇటీవల మహిపాల్ రెడ్డి అనారోగ్యంతో అకాల మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తన చిన్ననాటి స్నేహితులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. రూ.70వేలు జమ చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా తాము ఉన్నామనే భరోసా కల్పించారు.