చర్లపల్లి, జనవరి 19 : ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు నేమూరి మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని కుషాయిగూడలో చేపట్టిన రహదారి పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అదేశాల మేరకు ఆయన బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుషాయిగూడలో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రూ.40 లక్షలు నిధులు కేటాయించారన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన తెలిపారు.
డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ సంక్షేమ సంఘం ప్రతినిధులు సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, పాండాల శివకుమార్‌గౌడ్, చక్రపాణిగౌడ్, కిషోర్‌గౌడ్, చల్లా వెంకటేశ్, గణేశ్‌గౌడ్, దయానంద్, శంకర్, శివారెడ్డి, దేవేందర్‌రెడ్డి, నర్సింగ్‌గౌడ్, రఘుపతి, అర్జున్, యాదగిరి, శ్రీకాంత్‌రెడ్డి, రాఘవరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, మహేందర్, లక్ష్మారెడ్డి, శ్రీను, అనిల్, శేఖర్, లోక్నాధ్, బాలాజీ, సురేశ్‌రెడ్డి, హనుమంత్, చిన్నా, వెంకట్‌లతో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.