చర్లపల్లి, మే 22 : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరంలాంటిని, పేదలు సద్వినియోగం చేసుకొవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్‌కు చెందిన తోట దేవేందర్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.