చర్లపల్లి, అక్టోబర్ 6 : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ సినీయర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ కుమ్మరిబస్తీలో సుమారు 12లక్షల యాబై వేల నిధులతో చేపట్టిన పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అదేశాల మేరకు కాలనీవాసులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లో నెలకొన్న సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి దృష్టికి తీసుకుపొవడంతో ఆయన వెంటనే నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు.
కుమ్మరి బస్తీలో పర్యటనలో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే నిధులు కేటాయించి పనులు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. డివిజన్లో సమస్యలు ఉంటే ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకుపొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ సంక్షేమ సంఘం ప్రతినిధులు చక్రపాణిగౌడ్, యాదయ్య, చల్లా వెంకటేశ్, జనార్థన్, కిషోర్, సాయికిరణ్, నర్సింహులు, నందు, పిట్ల రాజు, సాయినాధ్, సీసీఎస్ అధ్యక్షుడు పద్మారెడ్డి, నాయకులు సారా అనిల్, మొగిలి రాఘవరెడ్డి, జయకృష్ణ, శ్రీశైలం, దాసరి కనకయ్య, సంపత్, శేఖర్‌నాయక్, వెంకటేశ్, సాయిబాబా, ప్రసాద్‌రెడ్డి, బాలాజీలతో పాటు స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.