National Science Day | ఉప్పల్ , ఫిబ్రవరి 28 : ఉప్పల్లోని సర్వే ఆఫ్ ఇండియాలో సైన్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ప్రదర్శనలు చేపట్టారు . పలు విద్యాసంస్థల విద్యార్థులు హాజరై సర్వే ఆఫ్ ఇండియాలో చేస్తున్నటువంటి విజ్ఞాన సంబంధించిన యంత్రాలు, పరికరాలను గురించి తెలుసుకున్నారు .
ఈ సందర్భంగా సైన్స్ ప్రాధాన్యతను తెలియజేసే విధంగా పరికరాల ఉపయోగం , వాటి సద్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సర్వే ఆఫ్ ఇండియాలో ప్రధానంగా డ్రోన్ ద్వారా చేపడుతున్న సర్వే వివరాలు, సమగ్ర సమాచారం విద్యార్థులకు అందించారు. 1986 నుంచి సర్వే ఆఫ్ ఇండియాలో సైన్స్ డే నిర్వహణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ జీఎన్ఎస్ఎస్ , డిజిటల్ లెవెల్, ఫోటో గ్రావిటీ, లాడార్ రిమోట్ సెన్సింగ్, త్రీడీ జీఐఎస్ ప్రధానంగా వీటి ఆవశ్యకతను తెలియజేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న సర్వేకు సంబంధించిన స్వామిత్య, నక్ష సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి అడిషనల్ సర్వేయర్ జనరల్ జి వరుణ కుమార్, డిప్యూటీ సర్వేయర్ జనరల్ పంకజ్ మిశ్రా హాజరై సైన్స్ డే ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ సర్వేయర్ సంతోశ్ , పంకజ్ సింగ్ కలాం, ఆఫీసర్ సర్వేయర్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.