MLA Marri Rajashekar reddy | మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ సెయింట్ పాయిస్ స్కూల్ వద్ద రూ.30.50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అల్వాల్ హిల్స్ సెయింట్ పాయిస్ స్కూల్ నుండి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు ఎల్ ఆకారంలో సీసీ రోడ్డును వేయిస్తామని అన్నారు. అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ 15 నుండి దేవాలయం వరకు త్రాగునీరు పైపులైను వేయిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అల్వాల్ హిల్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు భూపాల్ రెడ్డి, శ్రీనివాసరావు, నర్సింగరావు, శ్రీనివాస్, రమేష్, కిరణ్ కుమార్, వెంకన్న, భాస్కర్ రెడ్డి, రంగారెడ్డి, ప్రదీప్ రెడ్డి, రమేష్ కుమార్, కిషన్, దేవేందర్రావు, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శోభన్ బాబు, లక్ష్మణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, సురేందర్ రెడ్డి, పవన్, ప్రశాంత్ రెడ్డి, శరణగిరి, సురేష్, రేవంత్ రెడ్డి, దేవేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు