Kalayanalakshmi Cheques | మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 4 : నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న కళ్యాణలక్ష్మి చెక్కులను వెంటనే అందించాలని కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డికి ఇవాళ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ.. నాగారం మున్సిపాలిటీ పరిధిలో 80 చెక్కులు, కీసర ఆర్డీవో డివిజన్ పరిధిలో సుమారు 2000 చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడం వల్ల, ఇరువురి పార్టీల సమన్వయ లోపం వల్ల సమయానికి చెక్కుల పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్‌లో ఉన్న చెక్కులను వెంటనే పంపిణీ చేయాలని ఆర్డీవోను కోరారు. స్పందించిన ఆర్డీవో తగిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత ఎమ్మార్వోలకు వెంటనే ఆదేశాలు జారీ చేసి.. చెక్కులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బిజ్జా శ్రీనివాస్ గౌడ్, బుద్దవరం లక్ష్మీ, నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్