జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో ( District Court ) ఏసీబీ ( ACB ) అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ముగ్గురు కోర్టు సిబ్బంది రూ. 5 వేలు లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్ , పున్నం రజిత, కొమ్ము సునీతను అధికారులు అరెస్టు చేశారు. సర్టిఫైడ్ కాఫీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా బాధితుడు సిహెచ్ గోపాలరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు.