Donald Trump | 15 రోజుల్లో తేల్చాలి.. అణు ఒప్పందంపై ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Donald Trump : అమెరికా- ఇరాన్ మధ్య ఉన్న వివాదం ఎటూ తేలడం లేదు. తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాల్సిందే అని ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు.
Donald Trump : అమెరికా- ఇరాన్ మధ్య ఉన్న వివాదం ఎటూ తేలడం లేదు. తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాల్సిందే అని ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అయితే, ఈ అంశంపై ఇరాన్ కొన్ని షరతులు విధించింది. ఒకవైపు ఒప్పందంపై చర్చలు అంటూనే.. రెండు దేశాలూ యుద్ధ సన్నాహాలు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. 10-15 రోజుల్లో ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాలని అల్టిమేటమ్ ఇచ్చాడు.
ఒకవేళ ఈలోగా ఒక ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ‘‘ఇరాన్‌తో అణు ఒప్పందం అంత సులభం కాదని కొన్నేళ్లుగా అర్థమైంది. అయితే, మేం తప్పకుండా అణు ఒప్పందం చేసుకుని తీరాలి. లేకుంటే ఇరాన్ విషయంలో ఎలాంటి పరిణామాలైన జరగవచ్చు. పది రోజుల్లో సరైన ఫలితం కనిపించాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇరు దేశాలూ ఇలా చర్చలు అంటున్నా ఎవరికి వారు యుద్ధ సన్నాహాల్లో ఉన్నారు. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక చర్యలు ప్రారంభించింది. మధ్యధరా సముద్రంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ (యుద్ధనౌక)ను మోహరించింది. ఈ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టాలంతే తగినంత పూర్తిస్థాయి సైన్యం కావాలని సీనియర్ ఆర్మీ అధికారులు అంటున్నారు. మార్చి నెల మధ్యలో ఈ చర్యలకు అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఇరాన్ కూడా తన ఆయుధాల్ని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అణ్వాయుధాల విషయంలో ఇటీవలే జెనీవాలో ఇరాన్-అమెరికా మధ్య కొన్ని చర్చలు జరిగాయి. ఇరాన్ అణ్వాయుధాల తయారీని ఆపాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కానీ, దీనిపై చర్చించేందుకు ఇరాన్ నిరాకరించింది. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్‌పై దాడి చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రష్యాతో కలిసి ఇరాన్ నావికా విన్యాసాలు నిర్వహించింది. అగ్రదేశాలు ఇలాంటి చర్యలకు దిగుతుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

