అల్లాపూర్, ఫిబ్రవరి 22: మోతీనగర్ పరిధిలోని బబ్బుగూడ-అవంతినగర్‌కు వెళ్లే ప్రధాన మార్గం డంపింగ్‌యార్డును తలపిస్తోంది. స్థానికులు రోడ్డుపైనే చెత్తను పారవేయడంతో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతుంది. అయినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
స్వచ్ఛ ఆటోలు రోజు విడిచి రోజు రావడం వల్లే చెత్తను ఇలా రోడ్లపై పారవేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తరలించాల్సిన శానిటేషన్ విభాగం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇలా చెత్త రోడ్లపై వేయడం వల్ల దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు, నిత్యం స్వచ్ఛ ఆటోలు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.