గాజుల రామారం, జులై 25 : ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన మణిష్ గౌడ్‌కు 2012లో పింకిగౌడ్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు దేవ్‌గౌడ్ (7), దీప్గౌడ్ (3 ) ఉన్నారు.
అయితే పింకి గౌడ్ ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో గుర్తించి పలుమార్లు మందలించాడు. కాగా, ఈ నెల 19 తన ఇద్దరు పిల్లలను తీసుకుని పింకిగౌడ్ వెళ్లిపోయింది. ఆమెతో సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా కనిపించకపొవడంతో ఇద్దరి ఫోన్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.
దీంతో భార్య, పిల్లల గురించి చుట్ట పక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం భర్త మణిష్గౌడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.