హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్పీఆర్సీ ఇంటర్నేషనల్ ఎరీనా పోలో చాంపియన్షిప్లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 12-3 తేడాతో జర్మనీపై అద్భుత విజయం సాధించింది.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో భారత్ తరఫున అర్స్లాన్ ఖాన్(4), సలీమ్ అజ్మీ(4), చైతన్య కుమార్(3), సైఫ్ అట్టారీ(1) ఆకట్టుకున్నారు.