దుండిగల్, ఏప్రిల్ 5: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్లోని కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్సీని ఆయన కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా పలు సమస్యలు తెలియజేయడంతో పాటు పరిష్కరించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ రాజు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆదివారం శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో జరగబోయే నవమి వేడుకల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు.