MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, జూన్ 7: త్యాగానికి, సహనానికి బక్రీద్ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం మౌలాలి డివిజన్ షాదుల్లా నగర్ ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.
భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారని అన్నారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్ ఇచ్చే సందేశమన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అమీనుద్దీన్, భాగ్యానంద్, సత్యనారాయణ, ఉస్మాన్, ఇబ్రహీం, లియాకత్, నవాబ్, నర్సింగ్ రావు, వంశీ, సంతోష్, మారుతి ప్రసాద్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
కాప్రాలో భక్తిశ్రద్దలతో బక్రీద్ పండుగ..
కాప్రాలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఓల్డ్ కాప్రాలోని చారిత్రక ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా కమిటీ చైర్మన్ ఎం.కే.బద్రుద్దీన్, ముస్లిం మతపెద్దలు, స్థానిక ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు