మల్కాజిగిరి ఏప్రిల్ 5: కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారుల నడ్డి విరుస్తున్నదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం మౌలాలి డివిజన్ మారుతీ నగర్ రోడ్డుతో పాటు ఇతర రోడ్లు గుంతలమయమయ్యాయి. రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే పన్నులు మీకు గుంతలు మాకా అని స్థానికులతో కలిసి ప్లేకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలాలి డివిజన్లో మెయిన్ రోడ్డుతో పాటు కాలనీలో రోడ్లు గుంతలు పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు సిసి రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు వేయకపోతే స్థానిక ప్రజలతో కలిసి సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.