మల్కాజిగిరి, అక్టోబర్ 8: ప్రభుత్వ స్థలాలను కబ్జాలనుంచి కాపాడుతామని ఎమ్మెల్మే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వెంకటాపురం డివిజన్ సుభాష్‌నగర్ అశోక్‌నగర్‌లోని సర్వే నంబర్ 605లోని స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని, దానిని కాపాడాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కబ్జాచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా భవనాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్‌కిశోర్, విజయశేఖర్, బాలి, దీనేష్ తదితరులు పాల్గొన్నారు.