మల్కాజిగిరి, అక్టోబర్ 24 : నిరుద్యోగులకు ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జలవిహార్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలను కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో నాయకులు ఉదరగొట్టారని అన్నారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించక పోవడంతో పాటు నిరుద్యోగ బృతి ఇవ్వం మరిచారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల నిండ ముంచిందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు తెలియచేయడానికి నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబితాకిశోర్, సునీతరాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, జేఏసీ వెంకన్న, నాయకులు బద్దం పరశురాంరెడ్డి, అనిల్‌కిశోర్, రాముయాదవ్, నరేందర్ రెడ్డి, చిన్నయాదవ్, హేమంత్ పటేల్, ధర్మేష్యాదవ్, జనార్దన్, ప్రశాంత్‌రెడ్డి, సాయిగౌడ్, వెంకటేష్, సంజీవ్, ఉమాపతి, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.