Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, ఫిబ్రవరి 10 : అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సోమవారం సికింద్రాబాద్‌లోని జోనల్ కార్యాలయంలో ప్రజావాణిలో జెడ్సీ రవికుమార్‌ను కలిసి నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని.. సి.సి రోడ్ల డ్రైనేజీ పైప్ లైన్ ల కోసం నిధులు కేటాయించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం వల్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు ఎండాకాలంలో ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా నల్లా కనెక్షన్ల కోసం నిధులు కేటాయించాలన్నారు.
ఈ కార్యక్రమంలోకార్పొరేటర్ మేకల సునీత యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అంజయ్య, రాము యాదవ్, అమీనుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్