మల్కాజిగిరి, డిసెంబర్ 17 : నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వెంకటాపురం డివిజన్లోని భూదేవినగర్‌లో పార్కులో రూ.17 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పనులను బుధవారం కార్పొరేటర్ సబితా అనిల్కిశోర్తో కలికసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కులో ఆహ్లదంతో పాటు, జిమ్ ఏర్పాటుతో ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ అరుణ్‌కుమార్, హర్టికల్చర్ యూబీడీ సిబ్బంది భాస్కర్, నేతలు రమణారెడ్డి, రజిని, సందీప్‌రెడ్డి, తులసిరెడ్డి, వినయ్‌కుమార్, శివ, శాంతకుమార్, రామ్మోహన్, అంజిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, జనార్ధన్, శివ, తదితరులు పాల్గొన్నారు.