బోడుప్పల్, మే 4: సమాజంలో సంఘటితంగా ఉంటే గణనీయ అభివృద్ధి పనులు సాధించవచ్చని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీ గణపతి నగర్ కాలనీ ముఖద్వారాన్ని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ హయాంలో మానగర శివారు ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అన్నారు.
420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. లక్ష్మీ గణపతి నగర్ కాలనీ ముఖద్వారాన్ని సొంత నిధులతో బీఆర్ఎస్ స్థానిక మాజీ కార్పొరేటర్ కొత్త శ్రీవిద్య చక్రపాణి గౌడ్ రూ.2.50 లక్షల నిధులతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం 72 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, డివిజన్ ఇంచార్జ్ జగదీశ్వర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, నాయకులు రామచంద్రా రెడ్డి, గోపి, శ్రీనివాస్ గుప్తా, సత్యనారాయణ, లడ్డు బాయ్, నమస్కృతి, కాలనీవాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.