కుత్బుల్లాపూర్,సెప్టెంబర్24 : కాలనీల్లో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సత్వర చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు సూచించారు. బుధవారం 131 కుత్బుల్లాపూర్ డివిజన్లో ప్రజల సమస్యలపై పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలనీల్లో మరింత మౌలిక వసతులు కల్పించడంతో పాటు సకాలంలో సమస్యలను పరిష్కరించేలా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రజలతో ముఖాముఖీగా మాట్లాడి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్ విభాగాల అధికారులతో పాటు పార్టీ శ్రేణులు, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.