TJF Rajatotsava poster | కుత్బుల్లాపూర్, మే 29: ఈ నెల 31వ తేదీన నగరంలోని నెక్లెస్ రోడ్డులో నిర్వహించనున్న టీజేఎఫ్ 25 వసంతాల సంబురాల పోస్టర్ ఆవిష్కరణను యూనియన్ నేతలు గురువారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడి ప్రజలను చైతన్య పరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల రజతోత్సవ సంబురాలను నిర్వహించుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (హెచ్ – 143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధీర్ మహంకాళి, పలువురు విలేకరులు, జగన్, విజయ్ శేఖర్ గౌడ్, రషీదా మహమ్మద్ రఫీ, మంత్రి సత్య నారాయణ, సురేష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం