కుత్బుల్లాపూర్, మే 13: కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలు వారదులుగా నిలవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekanand) అన్నారు. జీడిమెట్ల డివిజన్ వైష్ణోయ్ ఎంక్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు సంక్షేమ సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలన్నారు. ఇప్పటికే కాలనీలో నెలకొన్న సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించానని గుర్తుచేశారు. అనంతరం మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి.. కాలనీలో పూర్తిస్థాయిలో మౌళిక వసతులను కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైష్ణోయ్ ఎంక్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు రంగు వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎంపీఆర్ చంద్రశేఖర్, కోశాధికారి కే.రాకేష్, ఉపాధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బీకే. గౌడ్, సంయుక్త కార్యదర్శి ఏ.నాగరాజు, ఎం.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎస్కే. పాండే, తదితరులు పాల్గొన్నారు.