చర్లపల్లి, సెప్టెంబర్ 30 : ఉన్నత చదువులలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు బీఎల్ఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివసాయినగర్లో నివాసుముండే ఎంపెల్లి క్రాంతి రణదేవ్ గ్రూప్-2పరిక్షలో ఉత్తీర్ణత సాధించి ఏఎన్వో అధికారిగా ఎంపికైన సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా బీఎల్ఆర్ ట్రస్ట్ కృషి చేస్తుందన్నారు.
విద్యార్థులు వారికి అభిరుచి ఉన్న రంగాలలో శిక్షణ తీసుకొవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పోటీ పరిక్షలకు హజరైయ్యే విద్యార్థులు ఆయా సబ్జెక్ట్లలో పట్టు సాధించే విధంగా శిక్షణ తీసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సినీయర్ నాయకుడు నేమూరి మహశ్గౌడ్, సీసీఎస్ అధ్యక్షుడు ఎంపెల్లి పద్మారెడ్డిలతో పాటు కాలదివాసులు తదితరులు పాల్గొన్నారు.