కాప్రా, డిసెంబరు 31: విద్యార్థులను శాస్త్రీయ దృక్పథం వైపు మళ్లించేలా పాఠ్యాంశాలను బోధించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మల్లాపూర్ డివిజన్ వెంకటరమణకాలనీలోని విజ్ఞానభారతి హైస్కూల్లో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా విచ్చేసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపటి సమాజానికి భవిష్యత్తు నిర్దేశకులు ఉపాధ్యాయులన్నారు. వారికి సమాజంలో గౌరవప్రాధాన్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పాఠశాల కరస్పాండెంట్ బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.