చర్లపల్లి, మే 11 : ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా కాలనీలలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్‌కు చెందిన వీఆర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు, కాలనీవాసులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి కాలనీలోని సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
వీఆర్ కాలనీలో డ్రైనేజీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించి కాలనీలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణం పనులు చేపడుతామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా కాలనీలో విధిదీపాల నిర్వహణ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని, కాలనీలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాలనీలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేశ్‌గౌడ్, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు శంకరయ్య, నాగిరెడ్డి, కాలనీ ప్రతినిధులు శ్రీధర్‌రెడ్డి, వేణుగోపాల్, రాజు, రవికుమార్, శంకర్రావు, కృష్ణకుమారి, సత్యమ్మ, ఉదయ్‌కుమార్, ఆనంద్, అంజనికుమార్సామి, మల్లేశ్, కరుణాకర్‌రెడ్డి, కృష్ణ, కిషన్, గిరిబాబు, సందీప్, నాగభూషణం పాల్గొన్నారు.