చర్లపల్లి, ఆగస్టు 7 : నిరుద్యోగ యువతీ యువకులు ప్రభుత్వంపై అధారపడకుండా తమకు అనుకూలమైన వ్యాపారం చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడలో సుజాత ఏర్పాటు చేసిన మెడికల్ షాప్‌ను ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని, ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిజైన్ శేఖర్, కాసం మహిపాల్‌రెడ్డి, కుమార్‌స్వామి, గోగికార్ శివకుమార్, బద్రుద్దీన్, మహేశ్, రేగళ్ల సతీష్‌రెడ్డి, మురళిపంతులు, ఆనంద్, విల్సన్, జయకృష్ణ, గోలి శ్రీను, గోవర్ధన్‌చారి, కొండల్‌రెడ్డి, సదాశివచారి, మల్లారెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.