ఉప్పల్, మార్చి 2 : నూతనంగా ఎన్నికైన కాప్రా ప్రింట్ మీడియా ప్రధాన పత్రికల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు పాత్రికేయుల అభ్యున్నతికి తన సంపూర్ణ తోడ్పాటును అందిస్తానని తెలిపారు. ప్రజా సమస్యలు, ఇబ్బందులను ఎప్పటి కప్పుడు వెలికి తీసి జర్నలిజం విలువలను పెంచేలా పని చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లయన్ జ్యోతిర్మయచారి ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాస్, కోశాధికారి వట్టిపల్లి సురేష్, ఉపాధ్యక్షులు పలుగుల పవన్, లక్కిడి బాల్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డమీది బాల్‌రాజ్‌గౌడ్, కార్యదర్శి రోజారాణి, క్లబ్ సలహదారులు కమిటీ ప్రతినిధులు చంద్రమౌళి, కేసీ మోహన్, క్యాసాని సత్యనారాయణ, కడియాల రమేష్, శ్రీనివాస్‌రావు, ఉల్లోజు శ్రీనివాస్, వేముల శంకర్, సహదేవచారి, నర్సింగ్‌గౌడ్, గుమ్మడి హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.