రామంతాపూర్,నవంబర్ 20 : విద్యార్థుల మేధస్సును పెంపొందించేకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం రామంతాపూర్ లోని ఎస్వీ హైస్కూలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్ర సాంకేతిక రంగం పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు.
కష్టపడి చదవిన విద్యార్థులు అన్ని రంగాలలోమంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం పాఠశాల చైర్మన్ పరివెద వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ మంచి విద్యా వంతులుగా తయారు చేసేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పరివెద వసుంధర, నవ ఉప్పల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంధం నాగేశ్వరావు, కార్పొరేటర్లు కక్కిరేణి చేతన, బండారు శ్రీవాణి వెంకట్రావు, శ్రీనగర్ కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.