చర్లపల్లి : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో నాయకులు, కార్యర్తలు భాగస్వాములు కావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ చక్రీపురంలోని సిరిగార్డెన్లో చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నేమూరి మహేశ్‌గౌడ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను గుర్తించి సమస్యలను పరిష్కరించడంలో నాయకులు, కార్యకర్తలు ముందుండాలని ఆయన సూచించారు.
డివిజన్లో పార్టీని పటిష్టం చేయడంతో పాటు డివిజన్ కమిటీలను వేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. డివిజన్లలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాండాల శివకుమార్‌గౌడ్, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, డప్పు గిరిబాబు, సారా అనిల్ ముదిరాజ్, శ్రీకాంత్‌రెడ్డి, రెడ్డినాయక్, కొల నరేశ్, మధు, మల్లేశ్, లక్ష్మినారాయణలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.