పీర్జాదిగౌడ, ఆగస్టు8: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలు పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి… మేడిపల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు ఊరేగింపుతో బయలుదేరి నగరపాలక పరిధిలోని పలు డివిజన్లలోని ఆలయాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కార్పొటర్లు, శశిరేఖ బుచ్చియాదవ్, మంజుల రవీందర్, అనంత్‌రెడ్డి, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గ దయాకర్‌రెడ్డి, నాయకులు, రవీందర్ పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లిలో బోనాల పండుగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బోనాల పండుగలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఆలయాల వద్ద అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నాయకులు హరివర్దన్ రెడ్డి, జంగయ్యయాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి మోహన్ రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్య్రమంలో కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్: ఘట్కేసర్ మండలంలో ఆదివారం బోనాలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని చౌదరిగూడ, కాచవాని సింగారం, ప్రతాపసింగారం, వెంకటాపూర్, మాదారం గ్రామంలో బోనాల పండుగను ప్రజలు జరుపుకున్నారు. జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సర్పంచులు వెంకట్ రెడ్డి, రమాదేవి రాములు గౌడ్, గీత శ్రీనివాస్, యాదగిరి ఆలయాల్లో పూజలు చేశారు.
ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో చైర్మన్ కొండల్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు ఆలయాల్లో పూజలు చేశారు. కమిషనర్ సురేశ్, వైస్‌చైర్మన్ రెడ్యా నాయక్, కౌన్సిలర్లు, భక్తులు అన్నోజిగూడలోని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.