Inter Results | కీసర, ఏప్రిల్ 22: కీసరగుట్ట గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు హవా చూపించారు. టీజీఆర్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ ఫలితాల్లో సత్తా చాటారు. ఎంపీసీ సెకండియర్‌లో 91.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. 37 మందికి గాను 34 మంది విద్యార్థులు పాసవ్వగా.. ముగ్గురు ఫెయిల్ అయ్యారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 86.49 శాతం ఉత్తీర్ణత సాధించారు. అంటే.. 37మందికి గాను 32 మంది పాసవ్వగా ఐదుగురు ఫెయిల్ అయ్యారు. బైపీసీ సెకండియర్‌లో 92 శాతం ఉత్తీర్ణత సాధించారు. 25మందికి 23 మంది పాసవ్వగా ఇద్దరు ఫెయిలయ్యారు. బైపీసీ ప్రథమ సంవత్సరంలో 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. 30 మందికి గానూ 24 మంది పాసవ్వగా.. ఆరుగురు ఫెయిలయ్యారు.
ఎంపీసీలో మానవాత్ కల్యాణ్ 989 మార్కులు, ధన్‌రాజ్ 986 మార్కులు, కేతావత్ అశోక్ 975 మార్కులు సాధించి రాష్ర్టస్థాయిలో నిలిచారు. బైపీసీలో పవన్‌కుమార్ 948 మార్కులు, నాయిని కృష్ణకుమార్ 946 మార్కులు, నాగ వెంకట ప్రణవ్ కౌండిన్యకు 922 మార్కులు సాధించిన్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ తాతారావు తెలిపారు.