Medchal : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో ఒకవ్యక్తి ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారి ఫిర్జాదిగూడ (Firzadiguda) వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటలంటుకున్న అతడిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే 108కు సమాచారమిచ్చారు. పరుగున వచ్చి మంటలు ఆర్పి.. అంబులెన్స్ రాగానే అతడిని అందులో ఎక్కించి గాంధీ ఆస్పత్రికి తరలించారు.
బలవన్మరణానికి ప్రయత్నించిన వ్యక్తిని సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్(Sai Easwar)గా గుర్తించారు. అయితే.. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? అనేది తెలియడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.