Ghatkesar | ఘట్కేసర్, మే 17 : ఘట్కేసర్ గ్రామానికి అరిష్టం కలగకుండా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలిగి ఉండేందుకు నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్టాపన ఎంతగానో దోహదపడుతుందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ పట్టణంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు పరిపారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా సోదరభావంతో ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని సూచించారు.
యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలి
అంతకుముందు ఘట్కేసర్ మున్సిపాలిటీ అవుషాపూర్‌లోని బీఆర్ఎస్ నాయకులు కందకట్ల దయాకర్ రెడ్డి, జీవన్ రెడ్డికి చెందిన మహా మోటార్స్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా స్వయం ఉపాధిని ఎంచుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.