MLA Mallareddy | అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ బరిలో ఉంటా : ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
MLA Mallareddy | బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ(Parliament Constituency) బరిలో ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (MLA Mallareddy) అన్నారు.
మేడ్చల్ : బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ (Parliament Constituency) బరిలో ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (MLA Mallareddy) అన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మల్కాజిగిరి ఎంపీ గా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్(Medchal), మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి(Kukatpalli), కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇదే తరహలో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తారన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని దీమాను వ్యక్తం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం(Party High Command) ఎంపీ స్థానాల గెలుపుపై ఫోకస్ చేసిందన్నారు.
లోక్‌సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి బీఆర్ఎస్(BRS) పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. తాను పోటీ చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశం ఈ నెల 21 తెలంగాణ భవన్లో పార్లమెంట్పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో అదిష్టానం నిర్వహిస్తుందని మల్లారెడ్డి చెప్పారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

