కులకచర్ల, అక్టోబర్ 23 : కులకచర్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం దగ్గర పీఏసీఎస్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బీఎస్ ఆంజనేయులుతో కలసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల రైతులకు అందుబాటులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు తాము పండించిన మొక్క జొన్న పంటను నేరుగా మార్కెట్ యార్డు దగ్గరకి తీసుకువెళ్లి విక్రయించాలని సూచించారు. మొక్క జొన్న విత్తనాలు క్వింటాలుకు రూ.2400 మొదటి రకానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, సీఈవో బక్కారెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.