Keesara | కీసర, మార్చి 4: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కీసరగుట్ట శ్రీభవాని రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఆరు రోజుల్లో రూ.92.49 లక్షల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ రెడ్డి తెలిపారు.
మహాశివరాత్రి సందర్భంగా గత నెల 24వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ఆరు రోజుల సాటు కీసరగుట్టలో ఉత్సవాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని మంగళవారంనాడు దేవస్థాన ప్రాంగణంలో లెక్కించారు. ఈ క్రమంలో ఆలయానికి రూ. 92,49,961లక్షల ఆదాయం వచ్చిందని కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రికి సంబంధించి అభిషేకాలకు రూ. 9,86,700 లక్షలు, స్వామివారి కల్యాణం రూ. 1,65,00లక్షలు, కల్యాణానికి సంబంధించి కట్నాలు రూ. 21,276వేలు, రథం కట్నాలు రూ. 4451 వేలు, వీవీఐపీ దర్శనం రూ . 3,89,000లక్షలు, శీఘ్ర దర్శనం రూ. 20,20,800 లక్షలు, నందివాహన సేవ రూ. 9503 వేలు, లడ్డూ ప్రసాదం రూ. 15,54,450 లక్షలు, వడలకు రూ. 1,69.060లక్షలు, పులిహోరకు రూ. 9,78,729 లక్షలు, వీవీఐపీ ఆన్లైన ద్వారా దర్శనం రూ. 71,000వేలు, స్వామివారి కల్యాణం రూ. 13,500వేలు, గర్భగుడిలో స్వామివారి అభిషేకం రూ. 1,06,700లక్షలు, హుండీ ద్వారా స్వామివారికి వచ్చిన ఆదాయం రూ. 28,98,901 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం మొత్తం అన్నింటికి కలిపి రూ. 92,49,961 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని అన్నారు.
గత సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి రూ. 77,79,525 లక్షల రూపాయలు వచ్చింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రూ. 14,70,436 లక్షల రూపాయల ఆదాయం అదనంగా వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలతో పాటు పలువురు పాల్గొన్నారు.