ములకలపల్లి : తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబీమా నమోదుకు ఆఖరి గడువు 30వ తేదీ అని మండల వ్యవసాయాధికారి కరుణామయి శనివారం తెలిపారు. రైతుబీమా నమోదుకు దరఖాస్తులు చేయించుకోని రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని, అలాగే కొత్తగా పట్టాపాస్‌పుస్తకాలు కలిగిన రైతులు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతులు రైతుబీమా దరఖాస్తు ఫామ్ నింపి సంతకం చేసి వారి పట్టాదారు పాస్ బుక్ , ఆధార్‌కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్‌లను జతపరిచి కార్యాలయంలో లేదా ఏఈవోలకు సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.