నేరేడ్మెట్, ఏప్రిల్ 9 : మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభతో గుర్తింపు పొందారు. కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు అందించారు. తెలంగాణ ప్రభుత్వం, నవ్ గురుకుల్ స్వచ్చంద సంస్థళ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణలో మల్కాజిగిరి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం జువిటెక్ సంస్థ నిర్వహించిన టెక్ టెస్ట్‌లో విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 83మంది విద్యార్థులు ఎంపికకాగా మాదిరెడ్డి నందిని, పసులూరి స్రవంతి, వెంకోదత్ ప్రేమ్ నాయక్‌లకు ట్యాప్‌టాప్‌లు ప్రదానం చేశారు. ఎంపికైన విద్యార్థులకు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రిన్సిపాల్ ఆచార్య బండి రాజు తెలిపారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తదితరులు ఉన్నారు.