కేపీహెచ్బీ కాలనీ, మార్చి 1: ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల గోపాల రావు (ఉగోరా) జన్మదిన సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి ఉగోరా అవార్డు ప్రదానం చేశారు. అలాగే నగదు పారితోషికం అందజేశారు. కాలేజీ ఆవరణలో శనివారం నాడు ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు విద్యా వెంకట్, కళాశాల ప్రిన్సిపల్ అలివేలు మంగమ్మ చేతుల మీదుగా పారితోషికం, అవార్డును అందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అలివేలు మంగమ్మ మాట్లాడుతూ.. కళాశాలలో చదువుతున్న విద్యార్థిని కే. దివ్యకు నగదు పారితోషకం అందజేయడం సంతోషకరమని తెలిపారు. కంటి చూపు సరిగా లేకపోయినా విద్యార్థిని ఉత్తమ మార్కులు సాధిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కరుణాకర్, అధ్యాపకులు నాగుల వేణు, సాయి కొండలు, జలీల్, ప్రవీణ్ రెడ్డి, పద్మ, మంజుల, గోపాల్, లక్ష్మణ్, ఉషారాణి, దశమ్మ, ప్రజా ఆలోచన వేదిక సభ్యులు సముద్రాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.