జవహర్నగర్, జూన్ 6: ప్రభుత్వ స్థలాల్లో సూచిక బోర్డులకు రక్షణే లేకుండా పోయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్లోని సర్వే నెం. 510లో నందనవనం పార్కులో రెవెన్యూ యంత్రాంగం గత నెల 22న ప్రభుత్వ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. నందనవనం పార్కును కబ్జాచేయాలని యత్నిస్తున్న కబ్జాదారులు రాత్రికిరాత్రే బోర్డును ధ్వంసం చేసి కిందపడేసి వెళ్లారు.
పార్కు స్థలం ప్రభుత్వానిదే అంటూ రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టినా రక్షణే కరవైందంటూ కాలనీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారుల చెర నుంచి పార్కును కాపాడి సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలకు వినియోగమయ్యేలా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.