Illegal Construction | కుత్బుల్లాపూర్, జూలై 16 : కుత్బుల్లాపూర్ సర్కిల్ 25లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రోజురోజుకు కుప్పలు తిప్పలుగా పేరుకు పోతున్నాయి. జీడిమెట్ల డివిజన్ 132 గోదావరి హోమ్స్‌లో గత కొన్ని రోజుల నుండి ఓ నిర్మాణదారుడు అక్రమంగా నాలాను ఆక్రమించి దానిపై నిర్మాణం చేపట్టాడు.
అటుపై స్లాబ్ లెవెల్ నిర్మాణం చేపట్టి దానికి రంగులు వేసుకొని అక్రమంగా ఇంటి నెంబర్‌ను కూడా పొందాడు. అనంతరం అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లోకి తీసుకొని యధేచ్చంగా బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని చేపట్టాడు.
అక్రమ నిర్మాణదారుడికి అధికారుల అండ..
అసలే నాలాను ఆక్రమించాడు. అటుపై అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టడంతో అక్రమ నిర్మాణదారుడికి అధికారుల అండ ఎంత ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. అక్రమ నిర్మాణంపై అధికారుల వద్దకు ఫిర్యాదులు వెళితే దానిని కప్పిపుచ్చుకునేందుకు ఒకటి, రెండు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శలకు తావిస్తుంది.
ఒకవైపు హైడ్రా నాలాలను, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదంటూనే మరోవైపు ఇలా దౌర్జన్యంగా అక్రమ నిర్మాణదారుడికి అధికారుల అండ లేకుండానే నాలాపై అక్రమ నిర్మాణాలు జరుగుతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కాగా దీనిపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. నాలాను ఆక్రమించింది వాస్తవమే కానీ నిర్మాణం పూర్తికావచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఏమి చేయలేమంటూ సమాధానం ఇవ్వడం వెనకాల నిర్మాణదారుడికి అధికారులు వత్తాసు పలకడం అక్రమ నిర్మాణాలపై అధికారుల అండదండలు తేటతెల్లంగా మారుతున్నాయి. యధేచ్చగా నాలాను ఆక్రమించి బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణంపై సంబంధిత ఉన్నతాధికారులు చొరవ తీసుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also :
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్‌ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం