మేడ్చల్ కలెక్టర్, మే 28: రాజీవ్ యువశక్తి పథకం అమలులో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అధికారులను హెచ్చరించారు. అధికారులు సమష్టిగా పనిచేసి అమలు లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై మేడ్చల్ కలెక్టరేట్లో శుక్రవారం నాడు రాధికా గుప్తా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మున్సిపాలిటీ కమిషనర్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, కార్పొరేషన్ అధికారులను ఉద్దేశించి రాధికా గుప్తా మాట్లాడుతూ.. అధికారులు బ్యాంకులను సమన్వయం చేసుకుని, అర్హులందరికీ పథకం అమలయ్యేలా చూడాలని సూచించారు. పథకం అమలుపై సీఎం రోజు వారీగా సమీక్ష నిర్వహిస్తున్నందున నిర్ణీత సమయంలో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.