Collector Gautham | శామీర్‌పేట, ఏప్రిల్ 19 : కోర్టులకు వెళ్లకుండా రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరించే విధంగా భూభారతి చట్టం రూపొందించడం జరిగిందని.. ఇది రైతులకు, ప్రజలకు ఎంతో ఉపయోగదాయకమని మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఇవాళ మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామం సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ప్రారంభించిన కలెక్టర్ ప్రజలకు, రైతులను అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోర్టులకు వెళ్లకుండా రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరించే విధంగా భూభారతి చట్టంలో తహాసీల్దారు స్థాయి నుండి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. భూ భారతి చట్టం ద్వారా భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. గ్రామ పరిపాలనాధికారి నియామకాలతో గ్రామ సమస్యలను తహసీల్దారు దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
చాలా పకడ్బందీగా మ్యాపింగ్..
అంతే కాకుండా భూభారతిలో ప్రభుత్వం ఆధార్ తరహాలో భవిష్యత్‌లో శాటిలైట్ ఆధారంగా భూమికి సంబంధించి సర్వే చేసిన కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకురాబోతుందని, తద్వారా చాలా పకడ్బందీగా మ్యాపింగ్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ భూధార్ విజయవంతమైతే భవిష్యత్తు తరాలకు ఎలాంటి భూ ఆక్రమణ సమస్యలు ఉండబోవన్నారు. లక్ష్మాపూర్లోనే చాలా భూ సమస్యలు ఉన్నాయని, భూ భారతి ద్వారా ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తామని కలెక్టర్ అన్నారు.
ఈ అవగాహన సదస్సులో నిపుణులు భూభారతి చట్టంపై మీకందరికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తారని, తర్వాత చట్టంలో ఏమి ఉన్నది అనే విషయాన్ని మీ ఊర్లో ప్రతీ క్కరికి అర్థమయ్యేలా మీరు మిగిలిన వారికి చెప్పాలన్నారు. అంతే కాకుండా జన సమూహాలుగా ఉండే కార్యక్రమాల్లో ఈ చట్టం గురించి మీరు మాట్లాడుకోవాలని కలెక్టరు కోరారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సింలుయాదవ్, మూడుచింతలపల్లి తహాసీల్దారు నర్సింహారెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్