PetBasheerabad | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 16: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల డివిజన్ పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25/1, 25/2 ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై పెరుగుతున్న ఫిర్యాదులతో హైడ్రా అధికారులు స్పందించారు. అధికారులు ఇవాళ ఆయా ప్రాంతాల్లో సందర్శించి ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను గుర్తించారు.
25/1 సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల కొంతమంది వ్యక్తులు దాదాపుగా ఓ క్వారీని పూడ్చి సుమారు 1500 గజాలు ఆక్రమించినట్లు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతోపాటుగా వినాయక నర్సరీ, నల్ల పోచమ్మ టెంపుల్ ఆలయం సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని, దానికి ఆనుకొని ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌ను సందర్శించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. కాగా 25/1 సర్వే నెంబర్లో ఓ వ్యక్తి 58 జీవో కింద దరఖాస్తు చేసుకున్నాడని దానికి ఎలాంటి అనుమతులు రాకముందే స్థలాన్ని మాయం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అదేవిధంగా గత కొన్నేళ్లుగా ప్రభుత్వ స్థలంలో నర్సరీని ఏర్పాటు చేసుకొని యధేచ్చగా ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకున్నారు. దీనికి అనుకొని మరో వ్యక్తి ఏకంగా నిర్మాణాలు చేపట్టడం పట్ల హైడ్రా అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. హారతి కర్పూరంలా కరిగిపోతున్న ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సందర్శించిన అధికారులు ఆక్రమణకు గురైన స్థలాలపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.
కబ్జాదారుల గుండెల్లో గుబులు..
సర్వే నంబర్స్ 25/1, 25/2 లలో ఆక్రమణ గురైన ఎకరాల స్థలాలను ఇవాళ హైడ్రా అధికారులు పర్యటించడంతో కబ్జాదారుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఇటీవల మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో కబ్జాదారులు రాత్రికి రాత్రే టిప్పర్లను పెట్టి క్వారీని పూడ్చి వేయించి సుమారు 1500 గజాల స్థలాన్ని చదును చేశారు. అంతటితో ఆగకుండా తాత్కాలిక షెడ్లు నిర్మాణాలు చేపట్టేందుకు పూనుకున్నారు. ఇదే క్రమంలో హైడ్రా అధికారుల పర్యటన కబ్జాదారులకు గుబులు రేపుతోంది. కాగా కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు మాత్రం సాదాసీదాగా కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నట్లు వినికిడి.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్