కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 2: దుబాయి మాస్టర్ టూర్ (400) ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో 55 ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ నగరానికి ( కేపీహెచ్‌బీ కాలనీ) చెందిన కొత్వాల వెంకట నారాయణ మూర్తి, ఓల్గా గ్రాడ్జ్ నోవా (రష్యా) తో కలిసి టైటిల్ విజేతగా నిలిచారు. అలాగే పురుషుల డబుల్స్ 55 ప్లస్ విభాగంలో మహారాష్ట్ర పుణేకి చెందిన జితేంద్ర జోషి తో కలిసి కొత్వాల వెంకట నారాయణ మూర్తిల జోడి టైటిల్ రన్నర్ అప్‌గా నిలిచారు.
ఈ సందర్భంగా వెంకట నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నమెంట్లలో 55 ప్లస్ విభాగంలో మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ విజేతగా… పురుషుల డబుల్స్ విభాగంలో రన్నర్ అప్ గా నిలవడం సంతోషంగా ఉందని అన్నారు. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు రావడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ టోర్నమెంట్ స్ఫూర్తితో రాబోయే టోర్నమెంట్లలో గొప్పగా రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని స్పష్టం చేశారు.