100 days plan | కీసర, జూలై 16 : ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి కాలనీల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకట్రెడ్డి తెలిపారు.
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు మారుతినగర్ కాలనీ బుధవారం మున్సిపల్ కమిషనర్, అధికారులు, స్థానిక నేతలు కలిసి కాలనీల్లో భారీ ప్రచారాన్ని నిర్వహించారు. కాలనీవాసులందరు తమ వార్డులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలనీవాసులందరు తమ తమ ఇండ్ల నుంచి వెలువడే చెత్తను తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి వేయాలని సూచించారు. అనంతరం ఆర్జీకే కాలనీలోని ప్రభుత్వ పాఠశాల్లోని 350 మంది విద్యార్థులకు ఎన్జీఓ విశ్వాసి సంఘటి సహయకులు బాబ్జీ సహయం, మద్దతుతో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, మ్యాట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఈఈ బాలమురళీ, మున్సిపల్ మేనేజర్ ఎ వెంకటేశం, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభులతో పాటు పలువురు పాల్గొన్నారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం