కుత్బుల్లాపూర్, జూలై 17: ప్రజలకు రక్షణ కల్పిస్తూ విధి నిర్వహణలో పోలీసులు నిరంతరం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్యం పై దృష్టి సారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అజుద హాస్పిటల్ వారు పోలీసుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గురువారం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కుత్బుల్లాపూర్ అజుద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. ఎం భరత్ కాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి పోలీసులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ విజయవర్ధన్ మాట్లాడుతూ సామాజిక సేవలో ఇలాంటి సేవలు చేయడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.