శామీర్ పేట, జనవరి 27: గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చొరవతో మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉడ్డమర్రి, లక్ష్మిపూర్ తండా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో డాక్టర్ చామకూర భద్రారెడ్డి పాల్గొని గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు చేశారు.
పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు, అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు రెఫర్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని స్థానికులు తెలిపారు. ఇలాంటి సేవలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నిర్వాహకులు పేరొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.